అంతుపట్టని ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో దాక్కుని వున్నాయి. ముఖ్యంగా అడవుల్లో,నదుల్లో,కొండల్లో,గుట్టల్లో  ఇంకా  మనిషికి  అంతుచిక్కని రహస్యాలున్నాయి . అవి ఎందుకు ఎలా జరుగుతున్నాయో పరిశోధనకు దొరకవు . మెక్సికో లోని ట్లాక్స్ కలా అడవుల్లో వేలకొద్దీ మిణుగురులు ఉంటాయి . ఏడాదిలో కొన్ని వారలు వీటి అందాలు చూసేందుకు ఆర్యటకులు వచ్చి వాలతారు . అప్పటి వరకు కటిక చీకటిగా ఉండే ఆ అడవి రాత్రి ఎనిమిదిన్నర గంటలు దాచేసరికి ఒక్కసారి వెలుగులతో నిండి పోతుంది . వేలకొద్దీ పచ్చని బల్బులు వేసి ఆర్పుతున్నాట్లు రాత్రి శోభాయమానంగా ప్రకాశిస్తుంది . ఈ అద్భుతమైన అందాన్ని చూసేందుకు టూరిస్ట్ లు క్యూ కడతారు . ఈ మిణుగురులు వనం చూసి ఆనందిస్తారు .

Leave a comment