Categories
WoW

వెయిట్ లాస్ మంత్రాలివే.

వెయిట్ లాస్ కు ప్రత్యేకమైన దగ్గరి దార్లో, చిట్కాలు, ట్రిక్కులు ఏవీ వుండవు. మెటబాలిక్ రేట్ పై ఓ కన్నేసి ఉంచడమే చురుగ్గా లేనప్పుడు మనం ఉపయోగించుకునే ఎనర్జీయే మెటబాలిక్ రేట్. విశ్రాంతిగా వునప్పుడు క్యాలరీలు ఖర్చు చేయడం ఎలా సాధ్యం? మిరపకాయలు మిరియాల్లో వుండే పదార్ధాలు బి. ఎం. ఆర్ ను మెరుగు పరచడంలో సహకరిస్తాయి. కాబట్టి తియ్యని పదార్ధాల కంటే స్పైసీ గా వుండే పదార్ధాలు ఎంచుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం వుంటుంది. వ్యాయామాలు కూడా బి.ఎం.ఆర్ ను మెరుగు పరుస్తాయి. పిచు పదార్ధాలు మంచి స్నేహితుల్లాంటివి ఎక్కువ సేపు కడుపు నిండిన భావనని కలిగించి చిరుతిండి వైపు ద్రుష్టి మరల్చనివ్వావు. లిఫ్ట్ వాడకం మానేయాలి. వీలైనప్పుడల్లా మెట్లెక్కి దిగాలి. అలాగే జిమ్ ఎంతవరకు అవసరమో అంత వరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. సప్లిమెంట్స్ కూడా బరువును తగ్గించుకోవడంలో తోడ్పడతాయి.

Leave a comment