సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేయాలి. ఇక కాంబినేషన్ స్కిన్ అయితే టొమాటో రసం అవకడో పేస్ట్ కలిపి రాయాలి. ఇది మొటిమలకు మంచి మందు నార్మల్ స్కిన్ అయితే ఒక టొమాటో రసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి పది నిమిషాల్లో కడిగేస్తే బావుంటుంది. ఓట్ మీల్ కూడా ఈ కాంబినేషన్ కు జత చేయొచ్చు.

Leave a comment