Categories
ప్రసవ సమయంలో వైద్యుల పొరపాటుతో కుడి భుజానికి గాయమై పని చేయకుండా పోయింది మనీషా రామదాస్ కు.అయిన ఆమెకు నిరాశ లేదు పదేళ్ల వయసు లోనే బాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టిన మనీషా 2021 నేషనల్ పారా ఛాంపియన్షిప్ సింగిల్స్, విమెన్స్ డబుల్ లో బంగారం సాధించింది. 2022 లో వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచి బెస్ట్ పారా ఫిమేల్ అవార్డ్ తీసుకుంది. పారిస్ పారా ఒలంపిక్స్ లో కాంస్యం సాధించింది. ఆమె వయసు 19. దేశంలో అతి చిన్న బాడ్మింటన్ ప్లేయర్ మనీషా రామదాస్.