పదేళ్ల సారా ఛిపా వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని 196 దేశాలు రాజధానులు వారు వాడే కరెన్సీ పేర్లను చెప్పి రికార్డ్ సొంతం చేసుకుంది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ ఎమ్ జి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఈవెంట్ లో పాల్గొన్న సారా అన్ని పేర్లు కరెక్ట్ గా చెప్పి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకుంది రాజస్థాన్ లోని బిల్వారా స్వస్థలం. తల్లిదండ్రులు వృత్తిరీత్యా తొమ్మిదేళ్లుగా యు ఎ ఈ లో ఉంటున్నారు ఆరో తరగతి చదువుతున్న సారా 1500 గంటల పైగా సాధన చేసి ఈ కేటగిరీలో గెలుపొందిన తొలి భారతీయ సంతతి వ్యక్తిగా నిలిచింది.