అరబ్ ఎమిరేట్స్ కు చెందిన డాక్టర్ ఖ్వాలా అల్ రోమైతి 87 గంటల్లో 208 దేశాలు చుట్టి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది.గత ఫిబ్రవరి 13న కోవిడ్ ప్రయాణ నిబంధనలు అమలులోకి రాకముందే ఆమె చివరి లక్ష్యమైన ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకుంది.ఏడు ఖండాలు, 208 దేశాలు తిరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మా దేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రపంచంలో ఎత్తైన కట్టడం నుంచి పెద్ద హై డెఫినిషన్ వీడియో కాల్ ,అత్యంత వేగంగా ప్రయాణం చేసే పోలీస్ కారు వరకు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టే అంశాలున్నాయి అందుకే ఈ ఏడాది గిన్నిస్ బుక్ థీమ్ డిస్కవర్ థిస్ కవర్ యువర్ వరల్డ్ ఎంచుకున్నాను నా టైటిల్ ను నా దేశానికి బహుకరిస్తున్నాను అంటుంది డాక్టర్ ఖ్వాలా అల్ రోమైతి.