Categories
మెనోపాజ్ వయసుకు చేరిన వారికి మామిడి పండు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ముఖం పైన వచ్చే ముడతలను నిరోధించే గలిగిన శక్తి మామిడికి ఉంది. మామిడి లో బీటా కెరోనిన్ లు ఇతర కెరోటినాయిడ్స్ ఫీనాలిక్, ఆస్కార్బిక్ యాసిడ్ లో కొన్ని రకాల మామిడి జాతుల్లో ఎక్కువ. ఇవి చర్మంలో సాగే గుణాన్ని అందించే కొల్లా జెన్ లు పెంచుతాయి. మెనోపాజ్ తర్వాత వచ్చే చర్మ సమస్యలు తగ్గిస్తాయి చర్మంలో తేమ పెరుగుతుంది. ముఖ చర్మం మెరుపు వచ్చి ముడతలు తగ్గినట్లు ఒక పరిశోధన నిరూపించింది. మామిడి పండులో చక్కెర అధికం కనుక పరిమితంగా రోజుకు మామిడి పండు తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందంటున్నాయి అధ్యయనాలు.