చిన్న పిల్లలు చాలా మందికి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. అలా  నోట్లో వేలుంచుకుని చప్పరించటం వల్ల పళ్ళు ఎత్తుగా వస్తాయని అది  మంచి అలవాటు కాదనీ తల్లులు శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు కూడా మంచిదేనంటారు పరిశోధకులు. ఈ కెనడా ఎక్స్ పెర్ట్స్ ఏం  చెపుతారంటే నోట్లో వేలు వేసుకోవటం నిజానికి చెడ్డ అలవాటే. కానీ పిల్లలు ఎప్పుడూ నోట్లో వేలు తీస్తూ వేస్తూ ఉండటం ఈ మధ్యలో ఎక్కడో చోట చేతులు పెట్టటం వల్ల  క్రిములు కొన్నయినా కడుపు లోకి వెళతాయి. సహజంగా ఈ క్రిముల్ని ఎదుర్కునే రోగనిరోధక శక్తి  శరీరంలో అంతా  పసితనం నుంచే పెరుగుతూ  వస్తుంది. ఈ క్రిములు పెరిగే కొద్దీ శరీరంలో వుండే రోగనిరోధక శక్తి  వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటుందనీ అంటున్నారు. క్రిములు చేరినా ఆయోగ్యాంగా తట్టుకుని ఎదిగే పిల్లలు పెద్దయిన తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరని చెపుతున్నారు. నోట్లో వేలు వేసుకోవటం మంచిదని చెప్పటం తమ ఉద్దేశ్యం కాదనీ కానీ ఈ అలవాటు గురించి తల్లులు మరీ కంగారు పడద్దనీ చెపుతోంది ఈ రిపోర్ట్.

Leave a comment