చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండేందుకు సౌందర్య ఉత్పత్తులు వాడే కంటే వేలకు కంటినిండా నిద్రపో మంటున్నారు ఎక్సపర్ట్స్ . నిద్ర శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది శరీరంలో అతి పెద్ద అవయవం అయిన చర్మం ఆరోగ్యం తాజాదనం, నిగారింపు మీద నిద్ర ప్రభావం చూపెడుతుంది. కంటి నిండా నిద్రపోతే చర్మం తనను తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి దానితో ఫ్రీరాడికల్స్ తొలగిపోతాయి. నల్ల మచ్చలు ముడతలు మాయం అవుతాయి. చక్కని నిద్ర తో మూత్రపిండాల్లో సోడియం నీటి మోతాదు ఒకే స్థాయిలో ఉంటుంది ఫలితంగా శరీరం తొందరగా నీటిని కోల్పోదు చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment