ఎందుకు చర్మం నల్లగా అయిపోటే ఈ పువ్వుల  పాక్ తో చర్మం యధా స్దితికి వచ్చేస్తుంది. మల్లె పువ్వులను మెత్తగా ముద్దగా చేసి పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి పది, పదిహేను నిమిషాలు అలా వుంచి కడిగేసినా చర్మం చక్కగా అయిపోతుంది. అలాగే గులాబీ రేకులు గుజ్జుగా చేసి పాలు గ్లిజరిన్ కలిపి ముఖానికి మెడకు పట్టించి పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు అలాగే బంతి పూలు ఎండబెట్టి మెత్తని పొడిగా చేసి ఆ పొడి లో తేనె కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పది నిమిషాలు ఆరనిచ్చి ముందుగా వేడి నీటి తో ముఖం కడిగేస్తే ముఖ చర్మం పై నుండే రంద్రాలు తెరుచుకుంటాయి. తర్వాత చల్లని నీళ్ళతో కడిగేస్తే చర్మం కాంతిలీనుతూ వుంటుంది. అలాగే చర్మం కాంతిని పెంచే గుణం మందార పువ్వుల్లోనూ వుంటుంది.

Leave a comment