ఈ ఐడియా చాలా బాగుంది. Street store. తమకి అవసరం లేని వాటిని వేరే వాళ్ళకు ఇచ్చేయడం. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు చెందిన స్నేహితులు కైలి లెవిటన్, మ్యాక్స్ పజక్ లు, అద్దె లేని స్థలంలో అందరికి అందుబాటులో వుండే లాగా ఉదయం నుంచి సాయంత్రం దాక రోడ్ పక్కని ఈ స్ట్రీట్ స్టోర్ తెరిచారు. ఇక్కడ పెట్టిన లోగోలు, అవసరమైన సామాగ్రి వివరాలు రాసి పెడితే సాయంత్రం వరకు ఎంతో మంచి దాతలు తోచినవి ఇచ్చారు. అవసరమైన వాళ్ళు వచ్చి తీసుకు పోయారు. మనం దాన ధర్మం చేసే మొహం పెట్టకుండా ఎదుటివాళ్ళ ఆత్మమ గౌరవం కాపాడే సాయం అన్నమాట బరిస్తా లోని భువనేశ్వర్ లో ఏహా ఇప్పటికి 180 నగరాల్లో స్ట్రీట్ స్టోర్స్ తెరిచారట. పది మంది కలసి ఇందుకు యాభై మంది దగ్గర నుంచి వాళ్ళకు అవసరం లేని బట్టలు, బూట్లు, పుస్తకాలు మిగతా ఎలాంటి సామాగ్రి అయినా సరే కలక్ట్ చేసి ఓ వీధి దుఖానం పెట్టేస్తే బహుశ నిరుపేదల అవసరాలు తిరిపోతాయేమొ. కొంతమంది వాలంటీర్లు ఇచ్చి రాతలు వుంటే చాలు వీధి చివర మన దుకాణం పెట్టేయోచ్చు.

Leave a comment