పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ చెర్రి, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సెమి సెమి ఆసిడ్ రకానికి చెందిన పండ్లు మిశ్రమం గా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. ప్రోటీన్లు ఖనిజ లవణాలు నూనె లో వంటి గుణాలు కలగలిసిన తటస్థ రకానికి చెందిన అవకడో, బాదాం, కొబ్బరి, వాల్ నట్స్ కూడా కలిపి ఇవ్వొచ్చు. కానీ జమ పండు, అరటి పండు కలిపి ఇవ్వడం, బొప్పాయి, కమలా ఫలం, క్యారెట్ కలిపి ఇవ్వడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు కలిపి చేసే సలాడ్ కూడా పిల్లలకు మంచిది కాదు. కొన్ని తేలికగా అరిగే గుణం వల్ల, కొన్నింటిలో అలంటి లక్షణం లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.

Leave a comment