నట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోమంటున్నారు అధ్యయనకారులు. నట్స్ తీసుకుంటే గుండె జబ్బులు టైప్-టు మధుమేహం వంటివి దూరం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గుప్పెడు నట్స్ తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మరణించే ముప్పులను మూడోవంతు తగ్గిస్తాయని కూడా అధ్యయనకారులు చెబుతున్నారు. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్, వేరుశెనగ అన్నింటికీ ఇది వర్తిస్తుంది నట్స్ లో ప్రొటీన్స్ అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉన్నాయి.

Leave a comment