మళ్ళీ మొదలెట్టండి

కొంత కాలం క్రితం ఆయిల్ పుల్లింగ్ అందరూ చాలా ఇష్టంగా ఫాలో అయ్యారు.మళ్ళీ ఎందుకు ఈ ఉత్సహం పోయింది .కానీ కొత్త అధ్యయనాలు దంతక్షయ నివారణకు కొబ్బరి నూనే వాడటం చాలా మంచిది అంటున్నారు .ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూలమైన దంతక్షయం టూత్ పేస్ట్ బదులు కేవలం కొబ్బరి నూనే వాడినా తగ్గిపోతుందంటున్నారు.టూత్ పేస్ట్ తో పళ్ళు కడగటం అయ్యాక కొబ్బరి నూనేతో చాలా పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటిలో క్రిములు నశిస్తాయంటున్నారు .ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనే వాడకం పై జరిగిన అధ్యయనాలలో ఈ విషయం ముఖ్యమైనదిగా తేల్చారు.