నీహారికా,

మనలో ఓ అంతర్గత శక్తి ఉంటుందిట. అదెలా వస్తుందీ అంటే వున్న దాని తో సంతృప్తి చేనటం, ఆనంద మాయ జీవనం, నిర్మాణాత్మకమైన జీవన విధానం లో హాయిగా, ఆనందంగా జీవించగలగడమే లోపలి శక్తి. మనం చేసే పనుల వల్లనూ మన పాజిటివ్ ఆలోచనల తోనూ ఈ శక్తి పెరుగుతుంది. తప్పులు చేయడం, ఆదుర్దా, డిప్రెషన్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇతరులను భాదిన్చాదం, ఇరిటేషన్, టెంపర్ మెంట్ లాంటి వ్యతిరేక భావాల్ని మనస్సులో నింపుతూ పొతే  అంతర్గత శక్తి క్షీనించిపోతూ మాటు మాయమైపోతుంది. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మనస్సుకీ, శరీరానికి వుండే సన్నిహిత సంబంధం వాళ్ళ ఒక దాని ప్రభావం, ఇంకొక దాని పైన వుంటుంది అందుకే మనస్సుకి సరైన శిక్షణ ఇవ్వాలి. ఎలాంటి సందర్భంలోనైనా స్ధిరంగా ఉండేలా కట్టు బాటు చేయాలి. సాధ్యమా? అంటే సాధ్యమె. ఒక మనిషిని ద్వేషించటం అంటే ముందర మన మనస్సు పై భారం మోపడమె కదా. ఒకరి పైన కోపం రావడం అంటే మనం అనవసరంగా ఉద్రేక పడటమే  కదా. ఇలాంటివి తగ్గించుకోవడం ప్రాక్టీస్ చేయాలి, అలవర్చుకోవాలి. అప్పుడే మనస్సు నిండా శాంతి. శరీరానికి ఆరోగ్యం.

Leave a comment