నీహారికా. నవ్వు ఆరోగ్యాన్నిస్తుందని తెలుసా నీకు మనసారా నవ్వడం ఒక టానిక్ లాంటిదని  అది శరీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నవ్వు వల్లనే సమాజంలో గుర్తింపు వస్తుంది. చక్కని నవ్వు అందరినీ ఆకట్టుకొంటుంది. సామాజికంగా ఒకరినోకరిని దగ్గర చేయగల శక్తి నవ్వుకు వుంది. ఒక నవ్వు ఎదుటి మనిషి మొహం పైన ఇంకో నవ్వును పూయిస్తుంది. ప్రాంతం, భాష రంగు జాతి వంటి తేడాలు ఎన్ని వున్నా మనుషులందరినీ ఒక్కటిగా చేసేది నవ్వే. భాషలు వేరయినా తోలి పలకరింపు నవ్వేగా. దాని తర్వాటే మాట్లాదుకోవడం కదా. నవ్వడం మరచి పొతే ప్రతి చిన్నదీ సమస్యనే. సంతోషం పోతుంది. కోపం పెరుగుతుంది. మనిషి దీర్ఘకాలం సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే ముందు మనస్పూర్తిగా నవ్వాలి. మన శరీరానికి మనస్పూర్తిగా నవ్వామా? లేదా ఊరికే పెదవులపైనే నవ్వుతున్నామా అన్న తేడా లేదట నవ్వుని నవ్వుగానే తీసుకొని తేలిక పడుతుందిట. ఇది బావుంది కదా.

Leave a comment