స్టార్ కిడ్ గా నాకు చిన్నప్పుటి నుంచి గుర్తింపు ఉంది అంటుంది కల్యాణీ ప్రియదర్శన్. అయితే మొదట్లో నా ప్లాన్స్ లో యాక్టింగ్ లేదు. నేను చాలా సెన్సిటివ్ కూడా .విమర్శల్ని చాలా వ్యక్తిగతంగా తీసుకొంటాను సినిమాల్లో భాగం కావాలని ఉండేది. అందుకే సెట్స్ వెనక పని మొదలుపెట్టినప్పుడు యూ.ఎస్ లో డిజైనింగ్ లో డిగ్రీ చేశాను. 2013లో క్రిష్ 3 కి అసిస్టెంట్ ప్రోడక్షన్ డిజైనర్ గా చేశాను. సాబు సిరిల్ తో ఇరుముగన్ సినిమాకి పని చేశాను. ఇక హలో సినిమాలో నేను తెలుగులో నటించే సమయానికి నాకు తెలుగు అస్సలు రాదు. డైరక్టర్ చెప్పినట్లు పూర్తి నమ్మకంతో పని చేశాను అంటోంది కల్యాణీ ప్రియదర్శన్.

Leave a comment