ముఖ చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే కొబ్బరినీళ్ళతో మొహాన్ని శుభ్రం చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్.కొబ్బరి నీళ్లను వేళ్ళతో అద్దుకొని మసాజ్ చేసుకోవాలి. సబ్బుతో కాకుండా సోప్ లిక్విడ్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ జాగ్రత్తలు మొహాన్ని పొడిబార  నివ్వకుండా చేస్తాయి.ముఖ చర్మం మృదువుగా ఉండాలంటే మృత కణాల సంఖ్య తగ్గాలి దీనికోసం దానిమ్మ రసం, ద్రాక్ష రసం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఇందులో అర టీ స్పూన్ బాదం నూనె కలిపి చర్మానికి పట్టించి వేళ్ళతో సున్నితంగా మర్దనా చేస్తే దానిమ్మ ద్రాక్ష లోని పులుపుతో మృతకణాలు తగ్గుతాయి.బాదం నూనె లోని ఇ-విటమిన్ వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

Leave a comment