వయసుకి తగ్గ బరువు చాలు

బాల్యం నుంచి బొద్దుగా ఉండే పిల్లల్లో లైంగికంగా వచ్చే మార్పులు చిన్నా వయసు నుంచే కనిపిస్తాయని చెపుతున్నారు బివీ విశ్వవిద్యాలయ పరిశోధకులు . మగపిల్లల్లో 9 సంవత్సరాల వయసుకే లైంగిక మార్పులు కనిపిస్తాయి . ఇలా తక్కువ వయసులో వచ్చిన మార్పులు వారిని మానసిక పరమైన ఇబ్బందులకు గురిచేస్తాయి . వారిలో భావోద్వేగ పరమైన సమస్యలు వస్తాయి కుంగుబాటుకు లోనవుతారు కోపం ,చిరాకు పెరుగుతాయి . చిన్న కారణం తోనే భౌతిక దాడులకు దిగుతారు . ఇలాంటి సమస్య రాకుండా పిల్లల్లో అదనపు కొవ్వు చేరనివ్వకుండా చుడండి . వాళ్ళకు ఆరోగ్య పరమైన ఆహారం ఇవ్వండి అంటున్నారు . చిన్నతనంలో బొద్దుగా ఉన్నా నడక నేర్చాక మాత్రం పిల్లలు వయసుకు తగ్గ బరువుండాలి .