కొన్ని మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటారు ఎక్స్ పర్ట్స్. పువ్వులు భగవంతుడు మనుషులకిచ్చిన విలువైన కానుకలు ఎన్నొ పువ్వులు, అద్ద్భుతమైన రంగులు సువాసనతో మనసుకు, శరీరానికి ఆహ్లాదాన్నిస్తాయి. కాని వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆ పువ్వులను కళ్ళతో చూస్తున్న వాటి సూవాసన పీల్చిన మానసిక శారీరక రుగ్మతలన్ని మాయం అవుతాయి. బోకెలో మనం చూసే స్నాప్ డ్రాగన్ అలాంటిదే నిలువుగా ఉన్న కాండానికి చిన్న చిన్న పూలు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు కోపం తగ్గిస్తాయి అంటారు పరిశోధకులు. అలాగే కండరాల నొప్పిని ఒత్తిడిని అదుపు చేస్తాయి. ఎండలో,నీడలో ఎలాగైన ఈ మొక్కల్ని పెంచోచ్చు. ఇవి ఎన్నో రంగుల్లో ఉంటాయి.