కొందరికి కోపం వస్తే చుట్టూ భూకంపం తెచ్చేస్తారు. ఉచితానుచిత జ్ఞానం పోతుంది వాళ్లకి, దీనికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడమే. ఎప్పుడూ అవతలి వాళ్లలో లోపాలు వెతుక్కుంటూ ఉండడమే కారణం. పోనీ అలా విరుచుకుపడే ముందర నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి, ఇతరులపైన కోపం తెచ్చుకునేందుకు నాకేమి అధికారం ఉంది..నేనూ ఏదైనా తప్పు చేశానా అన్న ప్రశ్నలు వేసుకుంటే ముందర కోపం రాదు. ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఏదో ఒక విషయంపైన కోపం వస్తుంది. అప్పుడు మాటా మాటా పెరిగి చాలా తీవ్రమైన పరిణామాలు వస్తాయి. అప్పుడు అదుపు చేసుకోకపోతే మానవ సంబంధాలు చెడిపోతాయి. అయితే కోపాన్ని ఒక వ్యవస్థను చక్కబెట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇంటి పెద్దగా ఇంట్లో చిన్న వాళ్లను క్రమశిక్షణలో ఉంచేందుకు కోపం చిన్నపాటి ఆయుధం. ఇళ్లు చక్కదిద్దేందుకు కోపం ఒక ఉపకరణం, సాధనం. కానీ కోపం వల్ల మనకే నష్టం. లోపలి నుంచి ఉబికి వచ్చే కోపం ఎన్నో ఆనారోగ్యాలకు, ఒత్తిడికి మూలం. దాన్నుంచే ఎన్నో అవగుణాలు…ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, బీపీ, యాంగ్జైటీ..ఇవన్నీ కోపంతో పాటు అంటుకునే అవలక్షణాలు. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని అంటారు.
Categories