మనుషుల మాటలను తిరిగి పలికే చిలక లేక కాదు ఆ శక్తి కలిగిన ఇతర పక్షుల ఉన్నాయంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఆ దేశం లో దొరికే మస్క్ డక్ అనే బాతుల్ని ఇంటి కాంపౌండ్ లో పెంచితే ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలను తిరిగి అనటం మొదలు పెట్టాయి. అవి తిట్లు అనే సంగతి బాతుకు తెలియదు కానీ తిరిగి పలకటం మాత్రం వచ్చు. 1987లో ఆ బాతు మాటలను ఇంటి వారు రికార్డ్ చేశారు ఆ బాతును పంజరంలో పెట్టి పదేపదే విసిగిస్తే ‘యు బ్లడీ ఫూల్’ అని తిరిగి అనేది. ఇది ఇంటి వాళ్ళు సరదాగా తీసుకున్నప్పటికీ చిలుక వాలే బాతూ మాట్లాడగలదని ప్రపంచానికి వారు తెలియజేశారు మస్క్ డక్ బాతులు చిలకల్లాగా చక్కగా మాట్లాడతాయి.

Leave a comment