Categories
Soyagam

మెరిసే పెదవులు

లిప్ స్టిక్ రంగులు , కాంబినేషన్లు అమ్మాయిలకు కొత్తకాదు. ఏ లిప్ స్టిక్ అయినా లిప్ గ్లాస్ కాస్త బయట తిరిగే సరికి ఎండిపోయి పెదవులు డల్ గా అవుతాయి. సెమీ లిక్వీడ్ లిప్ స్టిక్ వేసుకొన్న కాసేపటికీ అది అలాగే పెదవులపైన ఆరిపోయి ఆ మెరుపు కాస్త పోతుంది. అయితే ఇలా ఎండిపోయి ఆరిపోయి పెదవులు పొడిబారి పోకుండా మాయిశ్చరైజింగ్ షేర్ లిప్ గ్లాస్ మార్కెట్లోకి వచ్చింది. ఇవి వేసుకోవటం కూడా సులభమే. పెదవులు మెరిసిపోతూ కనిపిస్తాయి. ఎంతసేపైన ఆరిపోయి, తేమ ఎండిపోయి పొడిగా అయిపోవు . ఈ లిప్ గ్లాస్ ఎంతసేపయినా తాజాగానే ఉంటుంది.

Leave a comment