నిర్భయ తల్లి శరీరాకృతి ఇంత అందంగా ఉంటే ఇంక కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించలేను అనేశాడు కర్నాటక మాజీ డిజీపీ సాంగ్లీయాన. నేను నిర్ఘాంతపోయాను అన్నారు అశాదేవి నిర్భయ తల్లి . మా అమ్మాయిని తీవ్రంగా అవమానించినట్లు అగౌరవపరిచేలా ఉన్నాయి ఈ మాటలు. అమ్మాయిలకు ఎంత అన్యాయం జరిగినా ఎలాంటి దాడులు జరిగినా అబలలుగానే బతకాలని, ఆయన చెపుతున్నారు. నా కూతురు పైన అత్యచారం చేసిన నిందితుడు ముఖేష్ టివి ఇంటార్యూలో చెప్పిన మాటలే ఈ పోలీసు అధికారి నోటా విన్నాను అన్నరామే ఎంతో బాధతో. మరి ఇలాంటి అహంకారులకు చరమగీతం పాడేది ఎప్పుడో.

Leave a comment