ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నా గంటలకొద్దీ పనిచేసినా బయట తిరిగినాకాళ్ళ నొప్పులోస్తాయి. నాలుగైదు ఐస్ ముక్కల్ని హ్యాండ్ కర్చిఫ్ లో ముట కట్టి అది పాదాలు,మడమలపై ఉంచితే నొప్పి అదుపులోకి వస్తుంది. లేదా చల్లని నీళ్ళ సీసా పై అది పాదాన్ని వుంచి దాన్ని దొర్లించే ప్రయత్నం చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిముషాలు ట్రై చేసినా చాలు. ఒక్క కాలుతో ఐదు నిమిషాలు ట్రై చేసినా చాలు. పాదాల నొప్పులు, వాపులు తగ్గించడంలో వెనిగర్ చక్కగా పని చేస్తుంది. టబ్ లో సగం వరకు వేడిగా ఉన్న నీళ్ళు పోసి అందులో రెండు చంచాల వెనిగర్ వేసి కాళ్ళు ముంచి ఉంచితే చాలు, లేదా ఆ వేడి నీటిలో ముంచి పాదాలకు చుట్టుకుని, వేడి తగ్గగానే తీసేస్తూ, మళ్ళీ వేడి నీటిలో ముంచి పాదాలకు చుడుతూ వున్నా నొప్పుల నుంచి ఉపసమనం. అలాగే వేడి నీళ్ళలో గుప్పెడు ఎప్సాం సాల్ట్ వేసి కాళ్ళు ముంచి ఉంచినా నొప్పి తగ్గిపోతుంది. లేదా లవంగం నూనె తో అరికాళ్ళుమర్దనా చేసినా పాదాల్లో రక్త ప్రసరణ జరిగి నొప్పులు పోతాయి.
Categories