ఎంత చేసిన ఇంటి పనికి సమయం సరిపోతుందని పిస్తుంది . ఎప్పటికప్పుడు కొన్ని పనులు చేసేస్తే పనిభారం కాస్త తగ్గుతుంది . ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన మిగిలిపోయిన కాస్తో,కూస్తో పదార్దాలు ఫ్రిజ్ లో వారల తరబడి దాచి ఉంచుతారు . కానీ ప్రయోజనం ఏమీ ఉండదు ఫ్రిజ్ నిండిపోవటం తప్ప అలా మిగిలిపోయినవి ఎప్పటికప్పుడు ఎవరికైనా ఇచ్చేయచ్చు . ఫ్రిజ్ లో చెత్తపోగు చేయకుండా ఉండాలి . ఫుడ్ తినగానే సింక్ నిండా గిన్నెలు పోగేయకుండా కనీసం ఇంట్లోవాళ్ళు ఎవరుతిన్న ప్లేటు వాళ్ళే కడుకొనేలా అయినా అలవాటు చేయాలి . డిష్ వాషర్ ఉంటె ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేయలి . అనవసరమైన అట్టపెట్టెలు ,ఖాళీ అయినా సీసాలు ,డబ్బాలు పనికివస్తాయిలే అని పేర్చిపెట్టవద్దు . పనికివస్తే అప్పటికప్పుడు దేనికి పనికివస్తాయో చూసుకొని వాడాలి లేదా నిర్మొహమాటంగా బయటపారేయాలి . ఇంటినిండా సామాను పేర్చుకొని ఇరుకైపోతుంది దుమ్ము పడుతుంది మురిగ్గా తయారవుతుంది కూడా .
Categories