కంగనా రనౌత్,జాస్సీ గిల్,రిచా చడ్డా నీనాగుప్తా నటించిన పంగా ఒక కబాడీ ప్లేయర్ జీవిత కథ. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొగలిగే ఆటలో రాణించగల జయ వివాహం అయ్యాక కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాజీ కబాడీ ఛాంపియన్ ని ఏడేళ్ల కొడుకు ప్రోత్సహిస్తాడు. తన తల్లిలో ఉండే ప్రత్యేకత ప్రపంచం గుర్తించాలనుకొంటాడు. భర్త కొడుకు సహకారంతో జయ మళ్ళి ఆటలోకి తిరిగి వస్తుంది. మేరీ కోమ్ జీవిత కథలాగా ఈ సినిమా కూడా ఒక క్రీడాకారిణికి కుటుంబ పిల్లలు,ఉద్యోగం బాధ్యతలు ఇవేవీ అడ్డుగోడలు కావనీ కుటుంబం సహకరిస్తే మళ్ళీ పూర్వ జీవితం లోకి వెళ్ళటం అసాధ్యం కాదని నిరూపిస్తుంది. కంగనా రనౌత్ చక్కగా నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారీ (Ashwiny Iyer Tiwari ) దర్శకత్వం వహించారు.

Leave a comment