Categories
ఈ పెళ్ళి కూతురు తన కాబోయే అత్తా మామలను బంగారం వజ్రాలు అడగలేదు అక్కడి ఆచారం ప్రకారం మగపెళ్ళి వారు తన కిచ్చే బహుమతిగా 10వేల మొక్కలు నాటించమంది.మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో గల కిషిపురా గ్రామానికి చెందిన పెళ్ళికూతురు 22ఏళ్ళ ప్రియాంక బడోరియా కోరిన కోరిక ఇది. 5వేల మొక్కలు తన తల్లి గారి దగ్గర ,మిగతా 5వేలు అత్తగారింటి దగ్గర ఉంచి ఆ చుట్టు పక్కల పంచిందట ఈమె. కరువు వల్ల తండ్రి పడిన కష్టాలు చూసి ప్రియాంక చిన్న తనం నుంచి ఎన్నో మొక్కలు నాటుతూ వస్తోందట.