Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/01/67435171_2353161694935590_7430629056594313216_n.jpg)
వండిన వంట కాస్త చల్లారి పోతేనే తినాలని పించదు కదా. మరి బ్యాంకాక్ లోని వాట్టన్న పానిచ్ అన్న రెస్టారెంట్ లో ఒక సూప్ చేస్తారట. ఆ రుచికి స్థానికులు ఎగబడిపోతారట. అయితే ఆ సూప్ ప్రత్యేకత ఏమిటి అంటే 45 సంవత్సరాలుగా ఆ సూప్ వండుతున్న పాత్ర శుభ్రం చేయలేదు. ముందు రోజు మిగిలిన సూప్ లో తర్వాత రోజున మాంసం ముక్కలు,ఇతర దినుసులు వేస్తారు ఆ మిగిలిన చద్ది సూప్ వల్లే దానికి మరింత రుచి వస్తుందని నమ్ముతారు. ఈ సూప్ ప్రత్యేకమైన వాసన నోరురిపోయేలా ఉంటుందట. మరి రుచి శుభ్రం చేయని పాత్రలోనా ? అందులో వేసే పదార్దాల లోనా ?