1971లో భారత్ పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ వారికి బందీగా దొరికారు లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే.అప్పటి నుంచి కనిపించకపోయిన అతని కోసం వెతుకుతూనే ఉన్నారు దమయంతి తాంబే.పెళ్లయ్యాక ఒక సంవత్సరంన్నర మాత్రమే కలిసి కాపురం చేశారు ఇద్దరూ.ఈ నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో కష్టపడి, లాహార్ కరాచీ సుక్కూర్ ఫైసలాబాద్,రావల్పిండి, ఇస్లామాబాద్ మొదలైన పాకిస్తాన్ కు చెందిన జైళ్లకు తిరుగుతూనే వెతుకుతూనే ఉన్నారు దమయంతి. వార్ విడోస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పాకిస్తాన్ నిర్బంధం లో ఉన్న ఎంతోమంది కోసం పోరాడుతూనే ఉన్నారు.ఢిల్లీ లోని జె ఎస్ యు లో స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతల్లో ఉన్నారు బాడ్మింటన్ లో నాలుగు సార్లు నేషనల్ ఛాంపియన్ ఆమె.పద్మశ్రీ కూడా వరించింది కానీ తాంబే జాడ మాత్రం ఇప్పటివరకు తెలియదు.ఇప్పటికీ ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారామె.