
తమిళనాడు కు చెందిన సుగుణకు చూపు లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతోంది. ఏడాది వయసులో చూపు పోయిన సుగుణకు ఓ ప్రమాదంలో చూపు పోయింది. ఆమె ఎదో తరగతిలో ఉండగానే పెళ్లి చేసారు. ఆమె భర్తకు చూపులేదు . నిరుపేద కుటుంబం. రైల్వే స్టేషన్ లో పల్లెలు చెక్కలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయ్యాక భర్త తో కలిసి సుగుణ 6వాటిని అమ్ముతోంది. మరోవైపు దూర విద్య ద్వారా ఇంటర్ బిఎ బీఈడీ పూర్తీ చేసింది. తర్వాత ఉద్యోగం వెతుక్కుందామనుకుంది . కానీ ఆ చదువుతో భవిష్యత్తు బాగుపడే ఉద్యోగం వస్తుందో రాదో అని పిహెచ్ డి కి సిద్ధమైంది. అప్పుడే చెన్నై లో మాతరం ఫౌండేషన్ నడిపే సుజిత్ దృష్టిలో పడింది. సుజిత్ సుగుణ చదువుకోవాలనే కోరిక ను ఆమె ఆసక్తి ఆమె ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఆమె భర్త అంధత్వం అన్నీ సోషల్ మీడియా లో వివారంగా పోస్ట్ చేసాడు. అది చూసి మహీంద్రా వరల్డ్ స్కూల్ యాజమాన్యం ఆమెకు ఉద్యోగం ఇబ్బంది ఆమె ఇద్దరు పిల్లలకి చదువుకునే అవకాశం ఇచ్చింది . సుగుణ ఇప్పుడు జాబ్ చేస్తూ పిహెచ్ డి చేస్తోంది . ఆమెను కెవిన్ కేర్ సంస్థ ఈ మధ్యనే ఎబిలిటీ మాస్టర్ అవార్డును అందించి సత్కరించింది.