ఈ మధ్య కాలంలో ఎన్నో భాషలు కనుమరుగైపోతున్నాయని లిపి లేక కొన్ని పోగొట్టుకుంటున్నామని కొన్ని రకరకాల ప్రాంతాల భాషలు కలిసిపోయి అసలు జీబ్ భాష పోతుందని అనుకుంటున్నాం. సరేనా ఇప్పుడో అమ్మాయి మెలేసామే ఏకంగా ఒక కొత్త భాష కనిపెట్టింది. అంతేకాదు ఆ భాషకు సంబంధించిన ఒక నిఘంటువును రూపొందించేసింది. ఇంగ్లాండ్ కొర్షమ్ పట్టణానికి చెందిన ఈ టీనేజ్ అమ్మాయి మెలీసా మాతృ భాష తో పాటు జర్మన్ ఫ్రెంచ్ స్పానిష్ పోర్చగీస్ ఇంకా ఇతర భాషలు నేర్చుకుంది. అయితే ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. తానూ ఒక భాష కనిపెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించిందట. మూడేళ్లు కష్టపడి 1500 పదాలతో కొత్త భాష రూపొందించింది. వేరు వేరు భాషల్లో పదాలు అక్షరాలు పలికితే వచ్చే శబ్దాల ఆధారంగా ఈ భాష కనిపెట్టిందిట. ఈ భాషకు స్కెన్వన్స్ అనే పేరు పెట్టింది. ఆటే మాట్లాడే భాష అని అర్ధం. ఇది అరబిక్ లిపిని పోలి ఉంటుంది . తానూ రూపొందించే నిఘంటువు లో ప్రతి పదానికి అర్ధం ఆ పదం ఎలా వచ్చిందన్న అంశాలు నిఘంటువులో ప్రతి పదానికి అర్ధం ఆ పదం ఎలా వచ్చిందన్న అంశాలు రాస్తోందిట. మొత్తానికి ప్రపంచ భాగాల్లో ఇంకో భాష వచ్చి చేరింది.
Categories