అందమైన దుస్తులకు అందమైన చెప్పులు కూడా తోడైతేనే బాగుంటుంది. ఎలాగంటే స్టెలెట్టన్ ఎంచుకుంటే, అవి అన్ని రకాల చెప్పుల కంటే చాలా ఎత్తుగా వుంటాయి కనుక నడుస్తున్నప్పుడు దుస్తులకు అడ్డం పడితే కష్టం. ముఖ్యంగా చీరలో అయితే జాగ్రత్తగా వుండాలి కూడా. ఇక పంల్స్ ఫార్మల్ దుస్తులతో హుందాగా కనిపిస్తాయి. అన్ని రకాల మిడిలు, మినిలు, అనార్కలిలు ఏవి ధరించినా సరే ఎత్తుగా, సొగసుగా కనిపించాలి అంటే వెడ్జ్ హీల్స్ ధరించాలి. జీన్స్ క్రాప్ టాప్స్, స్కర్ట్ లు ఇలా పాశ్చాత్య శైలి లో కనిపించాలి అనుకుంటే కిటెన్ హీల్స్ బావుంటాయి. వీటిలో పాయింట్ హీల్స్, సదా రకాలు దొరుకుతాయి. ఇక రోజువారీ డ్రెస్సులో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళేతప్పుడు ఫ్లిఫ్ ప్లాప్స్ బాగుంటాయి. సాంప్రదాయ పద్దతిగా కాజువల్ గా వేసుకునే డ్రెస్సులకు సరిగ్గా మ్యాచ్ అవ్వుతాయి. ఫ్యాషన్ అంటే వట్టి డ్రెస్సులే కాదు, జుట్టు అలంకరణ, మేకప్, హ్యాండ్ బాగ్, చెప్పులు అన్ని కలిసి సరిగ్గా మ్యాచ్ అయితేనే చూసేందుకు బాగుంటారు.
Categories