గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ లోకి చిరు ధాన్యాలు, ప్రోటిన్లు, పిచు పదార్ధాలు వుండాలి. అంటే చిరు ధాన్యాలతో తాయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, పండ్లు కలిపి తీసుకోవాలి. పరగడుపునే కేవలం పండ్లు తిని సారి పెట్టుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి రెండు అందుతాయి. జీర్ణ వ్యవస్థలో  ఇబ్బందులు వస్తాయి. ఉదయపు వేల శక్తి నిచ్చే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

Leave a comment