వేసవిలో ఎదో ఒక వెకేషన్ కు వెళుతూ వుంటారు. మరి ఇళ్ళు సేఫ్టీ మాటేమిటి? ఎంత అపార్ట్ మెంట్స్ లో వున్నా ఎవరి గోల వాళ్ళదిగా వుంటుంది. అందుకే కాస్త ఖర్చుతో కుడుకున్నదే అయినా సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే మనస్సు శాంతిగా నలుగు ఊర్లు తిరిగి రావొచ్చు. ప్రధాన ద్వారం దగ్గర కిటికిల దగ్గర కెమేరాలు ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన మంచి ఫలితం ఇవ్వొచ్చు. దొంగలు కెమెరాలు చూసి భయపడతారు. ఇవి సీలింగ్ కు ఏర్పాటు చేయాలి. ఆలోచన మంచి ఫలితం ఇవ్వొచ్చు. వీలైతే ఇలా కెమెరాలున్నాయి జాగ్రత్త అని ఓ బోర్డు తగిలించినా రైటే. వీలైతే సీక్రేట్ డోర్ బెల్ కెమెరా మాత్రం తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఎవరైనా డోర్ దగ్గరకు వస్తే స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చింది ఎవరో చూడొచ్చు. దాన్ని అమర్చడం ఉపయోగించడం తేలికే. అదే పనిగా సోషల్ మీడియాలో ఫలానా చూట భోజనాలు, ఫలానా చొట విడిది అని షేర్ చెయ్యోద్దు. ఇరుగు పొరుగు వాళ్ళని కాస్త చూస్తూ వుండమని చెఓఅదమ్ తప్పేం కాదు.
Categories