ఈ ఎండలకు నూనెలు, వేపుళ్ళు, కారాలు తినోద్దంటే ఓకె కానీ ఏదోటి తినాలి కదా అప్పుడు తృణధాన్యాలతో చేసిన మొలకలు ఫస్ట్ ఆప్షన్. వీటివల్ల కొన్ని సమస్యలుండవు, ముందుగా బరువు పెరగటమంటూ వుండదు. వీటిలో లభించే పీచు వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. త్వరగా ఆకలి కుగా వేయదు. అజీర్తి సమస్య బాధించదు.శరీరంలో వ్యర్ధాలు పోతాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది. మెదడుకు రక్తం సక్రమంగా సరఫరా అవుతుంది. ఈ మొలకల్లోని పోషకాలలో మెదడు పనితీరు బాగుంటుంది. 40 దాటాక మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమానతలకు ఈ మొలకలు మంచి సమాధానం. బీన్స్, నట్స్ లలో మాంసకృత్తులు ఎక్కువ. తృణధాన్యాల మొలకల్లోను అదే విధమైన మోతాదులో మాంసకృత్తులు ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇస్తే కండరాలు ధృడంగా పెరుగుతాయి. మొలకలలో జింక్, ఐరన్, కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా ప్రాణవాయువు అందేలా చేస్తాయి.
Categories