ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. తర్వాత మనస్సు స్వాంతన కోసం, ఉత్సాహం, శక్తి కోసం అరటి పండు తినాలి. ఇది తక్షణ శక్తి ఇస్తుంది. రుతుస్రావ సమయంలో వుండే చిరాకులను, తిమ్మిర్లను పోగొడుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గి ఎలక్ట్రోలైట్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు అరటి పండే ఆదుకుంటుంది. మనసు డల్ గా వుంటే నూనె తో చేసిన ఏ వస్తువు జోలికి పోకుండా ఒక అరటి పండు తిని కాసిన్ని మంచి నీళ్ళు తాగితే సరి.
Categories