Categories
WoW

భాషానైపున్యాలను పెంచే తల్లి పాలు.

పాపాయికి తల్లి పాలు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమో ఎప్పటి నుంచో తెలిసిన సంగతే ఎప్పుడూ తల్లి పాల అధ్యాయినాలు సాగుతూనే ఉంటాయి. ఈ ప్రయోజనానికి కొత్త జోడింపులు ఇలాగే తెలుస్తాయి. పిల్లలకు ఆరు నెలలకు పైగా పాలు ఇస్తే వాళ్ళల్లో జ్ఞాపక శక్తి సంబందించిన అంశాలు, భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయట. పిల్లలు తొమ్మిది నెలలు వచ్చినా తల్లిపాలు తాగుతూ వుంటే వారిలో శీఘ్రంగా గ్రహించే శక్తి కమ్యునికేషన్, చటుక్కున అందుకోవడం వంటి మంచి లక్షణాలు డెవలప్ అవ్వుతాయి. పసితనంలో తల్లిని అంటి పెట్టుకుని పదినెలలు వచ్చినా పాలు తాగే పిల్లల్లో ధైర్యం, సాహసం, భయపడని తర్వం సహజంగా అలసడతాయని, తల్లి స్పర్శ తో వాళ్ళు ధైర్యంగా వుండే లక్షణాన్ని అందిపుచ్చుకుంటుందని పరిశోధకుల సారాంశం.

Leave a comment