స్నేహం ఎలాంటి వాళ్ళనైనా ,ఎవరినైనా దగ్గర చేస్తుంది . మనుష్యుల మధ్యనే కాదు ,అది జంతువుల తో మనిషి అనుబంధం ఇప్పటికే రుజువైంది . పెంపుడు జంతువులు యజమానిని ఎంతో ప్రేమిస్తాయి . ఇద్దరు స్నేహితులున్నారు గాబ్రియిల్ ,డాల్ఫ్ హాకర్ . ఒకటి చిరుతపులి, గాబ్రియెల్ రెండు వాలంటీర్ గా దానికి ఎనిమిది నెలల వయసు ఉన్నప్పుడు వచ్చిన డోల్ఫ్ . దక్షిణాఫ్రికా ,బ్లామ్ పాంటిన్ లోని చితా ఎక్స్ పీరియన్స్ బ్రీడింగ్ సెంటర్ లో ఉంటుంది గాబ్రియెల్ . వాలంటీర్ గా అక్కడికి వచ్చిన డోల్ఫ్ చాలా మచ్చిక అయింది . నాలుగేళ్ళు అక్కడ గడిపాక డాల్ఫ్ స్వదేశం అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు . ఏడాది తర్వాత తిరిగొచ్చిన డాల్ప్ ను చూసి చీతా రెస్పాండ్ అయిన విధానం చూసి అందరూ ఆశ్చర్య పోయారు . అతని భుజాల పై ఎక్కి నాలుకతో మొహం పైన రాస్తూ తన ప్రేమను వ్యక్తం చేసింది గాబ్రియెల్. స్నేహ బంధం అంటే ఇదే కదా .

Leave a comment