Categories
Soyagam

సంవత్సరం పొడుగునా పాటించాలి.

అలంకరణ విషయంలో చాలా పద్ధతులు పాటించాలి. కొన్ని రొజూ చేసేవి, కొన్ని వారానికి ఒక రోజు చేసేవి. కొన్ని ఏడాది పొడుగునా చేసేట్టు అలవాటు పడవలసినవి వున్నాయి. ఆఫిస్ కు కాలేజీకు వెళుతుంటే ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం, నాణ్యమైన సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోవటం తప్పని సరిగా చేయాలి. ఇంట్లో వుండే గృహిణి అయినా సరే. అలాగే పడుకునే ముందు, ముఖానికి రాసుకున్న ఏ మేకప్ అయినా శుబ్రంగా తొలగించాలి. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పాదాలు ఇలా శరీరం మొత్తం మ్రుతకణాలు తొలగించే పని వారానికి ఒక సారి పెట్టుకోవాలి. మంచి నూనె రాసి నలుగు పెట్టుకుని స్నానం చేయాడం ముఖ్యం. మేకప్ బ్రష్ లను శుబ్రం చేయడం బ్యూటీ పార్లర్ లో ఫేషియల్, వాక్సింగ్ వంటివి నెలకోసారి చేయవలసిన పనులు ఇక ప్రతి రోజు మంచి నీళ్ళు తాగడం ఆహారంలో విటమిన్లు ఉండేలా చూసుకోవడం తగినంత నిద్ర పోవడం సంవత్సరం పొడుగునా చేయవలసిన పని ఇలా చేస్తే చస్తే చర్మం ఆరోగ్యంగా వుంటుంది.

Leave a comment