కొన్ని పదార్ధాలు పాలతో, పెరుగుతో, కూరగాయ ముక్కలతో కలిపి తింటూ వుంటాం. కాని కొన్నింటిని పద్దతిగా తింటే ఇంకా ప్రయోజనం. ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇచ్చేవి వీటిని ఎలా తిన్నా శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పీచు, మెగ్నీషియం, పొటాషియం అందుతాయి. వీటిని అప్పటికప్పుడు తినేకంటే పాలల్లోనో, పెరుగులోనో వీటిని రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తింటే మంచి శక్తి లభిస్తుంది. అలాగే నానపెట్టేప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లేదా డ్రైఫ్రూట్స్ వంటివి వేసేయవచ్చు. రాత్రంతా నానినందువల్ల ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. ఈ పదార్ధాల ఆన్నింటిలోను వుండే పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. శరీరంలో విడుదలయ్యే హానికర యాసిడ్స్ అన్ని దూరం అవుతాయి. పాలలో నానిన ఓట్స్ లో వేరుశనగ, బటర్, కిస్ మిస్ వంటివి కలిపితే ఓట్స్ రుచి పెరుగుతుంది. ఓట్స్ తియ్యగాను, పులుపు గానూ వుండే ఏ ఆహారంలో అయినా సులువుగా కలుస్తుంది.
Categories