నీహారికా,

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఎక్స్పర్ట్స్ చెపుతూనే ఉంటారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. వాళ్ళు తెలియకనే ఖరీదైన వస్తువులెన్నో పాడు చేస్తారు. అలాంటప్పుడు కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో పిల్లల్ని కొట్టడం, తీవ్రంగా మందలించడం తప్పంటారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. స్వరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. పిల్లలు తెలియకనే తప్పులు చేస్తున్నారని మనసుకు అందేలా చెప్పుకోవాలి. వెంటనే పిల్లల స్థాయికి దిగిరావాలి. వాళ్ళను ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళెంత గందరగోళం సృష్టించారో వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పాలి. నడక నేరుస్తున్న పాప వెనక నుంచి అరుస్తున్నా వినకుండా మెట్లెక్కి పోతూ ఉంటుంది. పడిపోతుందనే భయం కొద్దీనే కోపం వస్తుంది. కానీ నిగ్రహించుకోవాలా వద్దా. సంవత్సరం పిల్ల మెట్ల పై నుంచి పడిపోతే తన తలకే గాయం అవుతుందని తెలుసుకోగలరు. నెమ్మదిగా చెప్పుకోవాలి. చిన్న పిల్లలతో ఒక లాగా, పెద్దవుతున్న పిల్ల విషయంలో ఒక లాగా తల్లిదండ్రులే తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. పసి పిల్లలకు అరిస్తే అర్ధం కాదు. పెద్ద పిల్లలకు అరిస్తే ఆవేశం, అవమానం అన్నీ ఒకే నిముషంలో కలుగుతాయి. ఇప్పుడు కోపం అదుపులోకి తెచ్చుకోవలసింది తల్లిదండ్రులే ఏమంటావు?

Leave a comment