Categories
WhatsApp

స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు.

స్విమ్మింగ్ పూల్ లో డ్రేవ్ చేయడానికి మించిన వ్యాయామం ఇంకొకటి లేదు. పైగా వేసవికి ఇది చల్లదనం ఇస్తుంది. అయితే పూల్స్ లో కలిపే క్లోరిన్ కు భయపడి స్విమ్మింగ్ ను దూరం చేసుకోవడం సబబు కాదు. సిరోజాలకు నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తిసుకుంటే చాలు. హెడ్ కాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. ఆలివ్ లేదా కొబ్బరి నూనె తేలికగా రాసుకోవాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత క్లోరిన్ ఆనవాళ్ళు శుభ్రంగా కడిగేసి కండీషనర్ అప్లయ్ చేయాలి. క్లారిఫయింగ్ షాంపూ క్లోరిన్ ను కడగటానికి మంచి ఆప్షన్. వారానికి ఒక సారి హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రఫ్ గా అయ్యిపోకుండా వుంటుంది. పెరుగు గుడ్డు మిశ్రమం మంచి హెయిర్ ప్యాక్. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వున్న ఆహార పదార్ధాలు అధికంగా తీసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment