సాహతీ పింగళి కి పదహారేళ్ళు. పాలపుంతలో పేరు లేకుండా ఉన్న ఎన్నో చిన్నగ్రహాల్లో ఒక దానికి ఆమె పేరు పెట్టారు. చెరువులు, నదులు, సరస్సుల పైన అధ్యయనం చేయడం ఆమెకు ఆసక్తి. ఏడాది పాటు పరిశోధించి పరిశీలించింది. చెరువుల్లోని నీటి కాలుష్యాన్ని కనుగొనే యాప్ కు రూపం ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె సాధించిన విజయానికి మసచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోని లింకన్ లాబరేటరీ ఐ.ఎ.యు. అబ్బురపడి ఒక గ్రహానికి ఆమె పేరు ఖరారు చేసింది. ప్రస్తుతం సాహితి మిషిగన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఇంటర్న్ షిప్ చేస్తుంది . సి.వి.రామన్,రవీంద్ర నాథ్ టాగూర్,విశ్వనాథన్ ఆనంద్ వంటి వారి పేరు పైన గ్రహాలు ఉన్నాయ్. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి సాహితి కి ఆ అరుదైన గౌరవం దక్కింది.
Categories