Categories
జుట్టు పొడుగ్గా పెరగడం చాలా భాగం జీన్స్ బట్టే వుంటుంది. నూనె అనేది జుట్టుకు కండీషనర్ లాంటిది. ఆముదం, కొబ్బరి నూనె మందార నూనె ఏది వాడినా ఫలితం ఒక్కటే వీటితో మసాజ్ వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. ఆయిలీ హెయిర్ గల వాళ్ళు ప్రతి రోజు తలస్నానం చేయొచ్చు. రఫ్ హెయిర్ గల వారికి రోజు చేస్తే మరింత రఫ్ గా తయ్యారవ్వుతుంది. అలా చేయాలనుకుంటే తేలిక పాటి ష్యంపూ వడాలి. శీకాయ, కుంకుడు కాయలు కూడా మంచివే. షాంపూల వల్ల కొంత కెమికల్ ఎఫెక్ట్ వుంటుంది. కుంకుళ్ళ తో అటువంటి ప్రాబ్లం వుండదు. గోరింట మందార వంటి సహజ హెయిర్ ఫ్యాక్స్ జుట్టుకు చక్కటి కండీషనింగ్ ఇస్తాయి. అప్పుడప్పుడు ఈ ప్యాక్స్ వేసుకుంటే జుట్టు తెమేగా చక్కని కండీషనింగ్ తో వుంటుంది.