మొక్కజొన్న అటుకులు వేడి నీళ్ళలో వేసి ఓ క్షణం ఉండగానే పాలు, బెల్లం వేసి అందులో ఎండిన ఖర్జూర, జీడి పప్పు, కిస్ మిస్, బాదాం పప్పులు వేసి పాయసం చేసి పిల్లలకు పెడితే చాలా శక్తి వస్తుందని డైటీషియిన్స్ చెప్తున్నారు. బెల్లం బదులు పూర్తి ఖర్జూరం పలుకులు వేసిన పర్లేదంటున్నారు. ఈ ఖర్జూరంలో ఐరన్ పుష్కలనంగా ఉంటుంది. అత్యధిక శక్తి ని అందించే పదార్థం పైగా పీచు కూడా అధికం. ఆరోగ్యం పదిలంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, కెరానిక్, ఎలాక్ట్రోలైట్లు,బి కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఖర్జూరంలో ఎక్కువే. రక్త హీనత లేకుండా ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. గుండె వ్యాధులు రానీయదు. ఈ ఖర్జూరం ఏదో వంట తీసుకుంటే మంచిది. ఈ పాయసం ఓ సారి ట్రై చేయండి. పిల్లలకే కాదు, పెద్దలకు మంచిదే.
Categories