Categories
పనస తొనలు, పనస పొట్టు కూరలు, మనకు తెలుసు. ఇప్పుడు శాఖాహారుల కొసం వండితే అచ్చం మాంసాహారం లాగా కనిపించే టేస్టీ జాక్ ఫ్రూట్ బిర్యానీ తయ్యారు చేస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో బార్బిక్యులలో పన్నీర్ కర్రీ దొరుకుతుంది. మటన్, చికెన్ కర్రీల కంటే రుచిగా వుంటుందీ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ లో దొరికే పనస బిర్యానీ ని కధల్ బిర్యానీ అంటారు. కధల్ అంటే హిందీలో పనస పండు. క్యాలరీలు తక్కువగా వుండే పనసలో పోషకాలు ఎంతో ఎక్కువ. ఫైబర్ కుడా ఎక్కువే. పనస పొట్టు వంటకాలు ఎంత తిన్నా కొవ్వు చేరదు కనుక ఈ పనస బిర్యానీని పనస కర్రీలను మాంసాహారం తిన్న ఫీలింగ్ తో హాయిగా తినండి అంటూ ఆహ్వానిస్తున్నాయి రెస్టారెంట్లు. పనస బర్గర్, పనస పిజ్జా… అబ్బో చాలా రకాలున్నాయి ఓ సారి రుచి చూడొచ్చు.