నీహారికా,

పెరెంటింగ్ ఎప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఊహ జ్ఞానం లెనిన్ పిల్లలను, వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని సాకటం కష్టమైన టాస్కే. ఎంత సహనంతో అర్థం చేసుకొందామన్న వాళ్ళు ఒక పట్టాన లొంగరు. ఉదాహరణకు పిల్లలకు టైం సెన్స్ ఉండదు. అవతల కొంపలు మునిగి పోతున్నాయని పెద్దలు హైపర్ పడిపోతున్నా పిల్లలు తాపిగా ఉండరు. ఇది చూసి పెద్ద వాళ్ళు సహకరించడం లేదని,  సరైన వేళ్ళకి తయారుకావడం లేదని టెన్షన్ తెచ్చుకుంటారు. వేళకు రెడీ గా ఉండటం పిల్లలకు ఏమాత్రం పట్టదని తామే అన్నీ దగ్గరుండి చేయాలని పెద్దలే అర్థం చేసుకోవాలి. రెడీ అవరు అన్నీ పనులు మానుకోవాలి. పిల్లలకు నిజంగానే సమయ పాలన గురించి తెలియదు. ఏ సాక్స్ లో వేసుకోమంటే దీక్షగా వచ్చేదాక అందులోనే మునిగిపోతారు. పెద్దవాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకు టైం సెన్స్ లేకనే అలా పనిపైన దృష్టి పెడతారు. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక స్కూల్ టైం, బస్సు రావటం, ఈలోగా బ్రేక్ ఫాస్ట్ చేయాలనే జ్ఞానం వాళ్ళలో కలిగాక గానీ పెద్దవాళ్ళకు తిప్పలు తప్పవు. అంతవరకు హైపర్ గానే ఉంటుంది   మరీ.

Leave a comment