హైహీల్స్ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇవి కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైహీల్స్ ను షాప్ లో వేసి చూసుకునే సమయంలో రెండు పాదాలకు వేసుకుని నడిచి చూసుకోవాలి. ఒక్కసారి హీల్ నిడివిలో తేడా ఉండవచ్చు. మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం వుండాలి. పాయింట్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా వుండే షూస్ వేసుకోవద్దు. హైహీల్స్ వేసుకునే ముందర మోకాలి కింద వెనక భాగంలో వుండే కాఫ్ మజిల్ ను కాసేపు రుద్దుతూ వామప్ మసాజ్ చేయమంటారు డాక్టర్లు. కాఫ్ మజిల్స్ కు వ్యాయామం స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. హైహీల్స్ తో నడుస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తే వెంటనే వాటిని తీసేయాలి. నొప్పి భరిస్తూ నడవకూడదు. తొడుక్కునే షూస్ పాదం చివరనే ముగియకుండా ఇంకా రెండు సెంటీ మీటర్లు. ఎక్కువగా వుండాలి పాడ రక్షలు లేకుండా నడక కుదరదు కానీ సౌకర్యంగా ఉంటేనే నడవాలి.
Categories