Categories
సాధారణంగా మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చీ తేగానే ఫ్రిజ్ లో సద్దేస్తాం. కానీ అవి తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. టమాటాలు, బంగాళాదుంపలు, సిట్రస్ పండ్లు చల్లని కౌంటర్ టాప్ ల పై ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వాటిని స్టాక్ చేసే ముందర కడిగి ఆరబెట్టటం అస్సలు చేయకుదు. వాటిని లూజ్ గా రోల్ చేసిన ప్లాస్టిక్ బాగ్స్ లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లయ్ చేయడం వల్ల కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి రెండు మూడు రోజుల్లో వాడేద్దామనుకొంటే పండ్లను ఫ్రిజ్ లో పెట్టుకోవలసిన అవసరం వుండదు.